Srikanth Miryala

Srikanth Miryala

07-09-2022

09:03

డెంగ్యూ వస్తే ఏం చెయ్యాలి? ముందు ఆ ఏం కాదులే అని వదిలెయ్యాలి, జ్వరం ఎక్కువయ్యి ఒళ్ళు నొప్పులు తోడైతే అప్పుడు అమృతాంజనం రాసుకోవాలి, ఒకేవేళ బాగా నీరసం ఆవహించిందనుకో అప్పుడు బొప్పాయి ఆకుల రసం మూడు పూటలా తాగాలి, అయినా తగ్గకపోతే పక్కింటాయన సలహా మేరకు రక్త పరీక్ష చేయించుకోవాలి.

లక్షన్నర ఉండాల్సిన ప్లేట్లెట్స్ ఒక యాభై వేలకి పడిపోయాయనుకోండి,అప్పుడు పచ్చి పనసకాయలో తొనలు పడేసి బయటున్న దళసరి పచ్చని తొక్క ముక్కలు ఒక ఎనిమిది తినాలి.దీంతో పాటు పప్పు తినకూడదు,పాలు తాగకూడదు. ఇలా ఒక రెండు రోజులు తినాలి, అప్పటికి బాగా నీరసించి, ప్లేట్లెట్స్ ఒక పదివేలకు వచ్చేస్తాయి

అప్పుడు కొంచెం కాలుతున్న బొగ్గుల్లో సాంబ్రాణి వేసి జుట్టుకి పెట్టుకోవాలి, బట్టతల ఉన్నవాళ్లు ఇంకెక్కడో పెట్టుకోవాలి, నెత్తి కాలకుండా తడిగుడ్డ చుట్టుకోవాలి. సందేహం వస్తే మళ్ళీ పక్కింటాయన్ని అడగాలి. అప్పుడు ప్లేట్లెట్స్ ఒక ఐదువేలకి పడిపోయి, ఈలోగా మెల్లిగా బీపీ తగ్గడం జరుగుతుంది.

అంటే లోబీపీ అన్నమాట. మాట్లాడటానికి కూడా శక్తి ఉండదు. అప్పుడు పక్కింటాయన మీద నమ్మకం ఎదో సడలి డాక్టర్ దగ్గరికెళ్ళాలి. అతను మళ్ళీ రక్తం తీసి ప్లేట్లెట్స్ ఎన్నున్నాయో చూసి అర్జన్టుగా ఎక్కిస్తాడు, అలాగే ఆ బీపీకి కూడా సెలైన్ ఎదో పెడతాడు. మందులేవో పెడతాడు. అవేవీ బొప్పాయి ఆకుల రసం

అంత పనిచేయవు అది వేరే విషయం. ఈలోగా నాడి పట్టి మెదడులో ఎన్ని నాడీ కణాలున్నాయో చెప్పగలిగే తెలివి నైపుణ్యం మీ టివిలో వచ్చే స్వామీజీకి ఉన్నా ఈ డాక్టర్ కి అవి లేవు కాబట్టి ప్రతిరోజూ రక్తపరీక్ష చేసి ఇంకా ఎన్ని ప్యాకెట్ల ప్లేట్లెట్లు ఎక్కించాలో లెక్కేసుకుంటాడు. ఈలోగా బీపీ కూడా కొంచెం

స్థిరం అవుతుంది. ఇదంతా అయ్యేలోపు ఒళ్ళంతా సూదులతో గుచ్చేస్తాడు, అప్పుడప్పుడు తినలేవు కాబట్టి , అతనికి కుడపడం చేతకాక నోట్లో బడ్డెడతాడు, అలాగే నీ కిడ్నీలు పనిచేస్తున్నాయో లేదో తెలియాలంటే, అసలు మూత్రంలో రక్తం ఎమన్నా పోతుందేమో అని అతనికి మీ నాన్నమ్మ లాంటి ఎక్సరే కళ్ళు లేవు కాబట్టి

కిందన బడ్డు పెట్టి మూత్రం ఒక బ్యాగులో పడతాడు. అది లెక్కపెట్టడానికి మీవాళ్ళెవరూ ఉండరు కాబట్టి ఒక నర్సుని పెట్టి నిన్ను ఐసీయూ లో పెడతాడు. అందులో ఒక నాలుగైదు రోజులు చచ్చిచెడి తేరుకుని బయటికొచ్చి డాక్టర్ ని గుడ్డు తినొచ్చా, సీతాఫలం తినొచ్చా, చీజ్ పనీర్ దోస తినొచ్చా, మ్యాగీలో పెరుగు

తినొచ్చా అని అన్నీ అడిగేసి, దోమతెరొకటి కొనుక్కుని, డెంగ్యూ వైద్యంలో మంచి అనుభవం సంపాదించి ఇంటికెళ్తావ్. ఇప్పుడు మీ పక్కింటివాడికి జ్వరం వస్తుంది, ఎలాగూ మన డాక్టర్ వైద్యం వల్ల కాకుండా బొప్పాయి ఆకుల రసం వల్ల బ్రతికావ్ కాబట్టి అమృతాంజనంతో మళ్ళీ మొదలెట్టు. ఇది వ్యంగ్యము. 🙏


Follow us on Twitter

to be informed of the latest developments and updates!


You can easily use to @tivitikothread bot for create more readable thread!
Donate 💲

You can keep this app free of charge by supporting 😊

for server charges...